Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

పెళ్లి పీటలపై వధువు.. కాల్చిపారేసిన ప్రియుడు.. ఆపై ఆత్మహత్య

Advertiesment
Man
, గురువారం, 14 మార్చి 2019 (14:33 IST)
ఉత్తరప్రదేశ్‌లో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. అతను ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సహించలేక పచ్చని పందిళ్ల క్రింద సంతోషంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో అలజడి సృష్టించాడు. పెళ్లి పీటలపైనే యువతిని చంపి, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఉత్తరప్రదేశ్ రాయబరేలీలో ఘజపూర్‌కు చెందిన ఆశ, బ్రిజేంద్రలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే వీరిద్దరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే ఆశపై బాగా ఒత్తిడి తెచ్చిన తల్లిదండ్రులు ఆమెను మరో వ్యక్తితో పెళ్లికి అంగీకరించేలా చేసారు. 
 
అయితే తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని బ్రిజేంద్ర పెళ్లి జరిగే సమయంలో నేరుగా మండపంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆశను కాల్చి చంపి, ఆపై అతను కూడా అక్కడే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అనుకోని ఘటనకు అక్కడ ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు బ్రిజేంద్రను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలో చనిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయరాం హత్యకేసులో సినీనటుడు అరెస్ట్..