Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో దారుణం.. కుటుంబ కలహాలు.. భార్య ముక్కు కొరికిన శాడిస్టు...

అరాచాకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు కారణంగా భార్య ముక్కుకొరికిన శాడిస్టు భర్త వైనం ఇది. ఇటీవల వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. ఈ భార్యాభర్తల తగాదాలో ఆవేశ

Advertiesment
Man
, గురువారం, 3 నవంబరు 2016 (08:41 IST)
అరాచాకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు కారణంగా భార్య ముక్కుకొరికిన శాడిస్టు భర్త వైనం ఇది. ఇటీవల వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. ఈ భార్యాభర్తల తగాదాలో ఆవేశానికి గురైన భర్త తన భార్య ముక్కు కొరికేశాడు.  ఆ వివరాలను పరిశీలిస్తే...మోతీనగర్ గ్రామానికి చెందిన శివకుమార్, రాంపూర్ జంగల్‌కి చెందిన రాజకుమారితో రెండేళ్ల క్రితం పెళ్లైంది. 
 
అయితే, రాజకుమారి చదువుకునేందుకు భర్త అనుమతించలేదు. దీంతో కోపం చెందిన రాజకుమారి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదికాలంగా అక్కడే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు భర్త శివ తన అత్తగారింటికి వెళ్లాడు. అయితే, కంప్యూటర్ కోర్సులో చేరానని, రావడం కుదరని కుమారి తేల్చిచెప్పింది. అలాగే రాజకుమారి కంప్యూటర్ క్లాసుకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు ధరించింది. 
 
ఈ విధమైన వస్త్రధారణ శివకు అస్సలు నచ్చలేదు. దీంతో వారి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మరింత ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన శివ తన భార్యపై దాడి చేయడమే కాకుండా, ఆమె ముక్కును కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో షాక్‌కు గురైన ఆమె బిగ్గరగా కేకలు వేసింది. వెంటనే రాజకుమారిని ఆమె కుటుంబసభ్యులు సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలని ఉందా? ఏపీ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఇదే ఆహ్వానం