Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైక్‌పై నుంచి కిందపడబోయిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్

Advertiesment
బైక్‌పై నుంచి కిందపడబోయిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:53 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటి. 
 
ఇందులోభాగంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించిన మమత బెనర్జీ.. ధరల పెంపునకు నిరసనగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఆధారిత టూ వీలర్‌పై హెల్మెట్ ధరించి, ఆమె ప్రయాణిస్తుండగా, బండి అదుపుతప్పింది. 
 
దీంతో ఆమె కిందపడబోయారు. అప్పటికే ఆమె చుట్టూ పరిగెడుతున్న భద్రతా సిబ్బంది, మమతకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా, బండిని అదుపు చేశారు. ఆపై మమతా బెనర్జీ తన రైడింగ్‌ను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.
 
కాగా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో, మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత, ఆమెను గద్దెదించి, తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైట్ కర్ఫ్యూతో కరోనాకు కట్టడి వేస్తాం : సీఎం శివరాజ్ సింగ్