మహారాష్ట్రలో మొత్తం మూడువేల కేసులు దాటాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 3,320కి చేరింది. అటు ముంబైలోనూ కొత్త కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో మొత్తం కేసులు రెండు వేలు దాటాయి. దేశ ఆర్థిక రాజధానిలో సామాన్యులకే కాదు ఇప్పుడు నేవీ అధికారులకు కరోనా సోకుతోంది.
కరోనా విజృంభించడంతో ముంబై హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటికే అక్కడ దాదాపు రెండు వేల మంది పాజిటివ్‌గా తేలింది. ఇక ధారావిలో కరోనా కేసుల సంఖ్య వంద దాటింది. ధారావిలో కేసులు వేగంగా పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ముంబైతో పాటు పుణె ఇతర ప్రాంతాలను కేంద్రం రెడ్‌జోన్‌గా గుర్తించింది. ఇక మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 200 దాటింది. కొత్త కేసులు మాత్రమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 32 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
దాదాపు 20 మంది నేవీ అధికారులకు పాజిటివ్ అని తేలడం షాక్‌కు గురిచేస్తోంది. దీంతో వారిని ముంబై నగరంలోని కొలాబాలోని ఇండియన్ నేవీకి చెందిన అశ్వినీని ఆస్పత్రిలో చేర్చించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నావికాదళం సిబ్బందికి కరోనా సోకిన ఘటనతో తాము యుద్ధ నౌకలు, జాలాంతర్గాముల్లో వైరస్ లేకుండా శానిటైజ్ చేయించామని భారత నావికాదళం చెబుతోంది.