Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

Advertiesment
mahakumbhmela

ఠాగూర్

, ఆదివారం, 12 జనవరి 2025 (12:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధుసన్యాసులు వస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 యేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాలని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన సాధువు.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా కూడా కథనాలు ప్రచురించింది. 
 
బాలిక రేఖకు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు. ఈ విషయం తెలిసి జునా అఖాడా హెడ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి జి మహారాజ్ స్పందించారు. 13 యేళ్ల బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని, బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బాలికను దానంగా పుచ్చుకున్న మహంత్ కౌశల్ గిరిని, అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వారిద్దరికీ అఖాదాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!