Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడ స్త్రీని అద్దెకు ఇస్తున్నారు... నెల నుంచి ఏడాది దాకా... ఎంతో తెలిస్తే షాకే..

స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది. పురాణాలు, ఇతిహాసాల్లో సైతం వారికి పెద్దపీటనే వేశాయి. అలాంటి ఈ దేశంలో నేడు స్త్రీ అంగడిలో ఆటబొమ్మగా, ఒక వస్తువుగా మారిపోయింది. ఎంతలా అంటే అద్దెకు అమ్ముడుపోయేంతగా. సమాజంలో అన్ని వస్తువులు అద్దెకు తెచ్చుకునే సంస్కృతి

Advertiesment
అక్కడ స్త్రీని అద్దెకు ఇస్తున్నారు... నెల నుంచి ఏడాది దాకా... ఎంతో తెలిస్తే షాకే..
, మంగళవారం, 3 జులై 2018 (14:05 IST)
స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది. పురాణాలు, ఇతిహాసాల్లో సైతం వారికి పెద్దపీటనే వేశాయి. అలాంటి ఈ దేశంలో నేడు స్త్రీ అంగడిలో ఆటబొమ్మగా, ఒక వస్తువుగా మారిపోయింది. ఎంతలా అంటే అద్దెకు అమ్ముడుపోయేంతగా. సమాజంలో అన్ని వస్తువులు అద్దెకు తెచ్చుకునే సంస్కృతి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లో సమాజం తలదించుకొనేలా మహిళలను అద్దెకు ఇస్తారు. ఇలాంటి దారుణాలు మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్‌, గుజరాత్‌లో తరచూ జరుగుతుంటాయి.


మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వొచ్చట. స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలబెడతారు.
 
గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60,000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాలో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటిఆర్‌కి దిమ్మతిరిగేలా కౌంట‌ర్ ఇచ్చిన ఉత్త‌మ్..!