Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

లాక్‌డౌన్: ఫ్రెండ్ కోసం వచ్చి అతడి పిన్నితో శృంగారం, మర్మాంగాన్ని ముక్కలు చేసాడు

Advertiesment
Lockdown
, సోమవారం, 28 డిశెంబరు 2020 (22:06 IST)
ఇద్దరూ ప్రాణస్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. ఇద్దరిది ఇంటర్ పూర్తయింది. ఇక డిగ్రీకి వెళ్ళాలి. అయితే కరోనా కావడంతో ఎవరి ఇళ్ళ వద్దే వారే ఉండిపోయారు. కానీ స్నేహితులు కావడంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళుతున్నారు. స్నేహితుడి అని నమ్మినందుకు చివరకు తన పిన్నితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన ఇంటి పరువు పోకూడదని స్కెచ్ వేసి మరీ ప్రాణస్నేహితుడిని చంపేశాడు.
 
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా వండలూరు సమీపంలోని ఊరపాక్కంలో నివాసముండే సురేష్ కుమార్, రాజేష్ సెల్వన్, శ్యామ్, రాజులు మంచి స్నేహితులు. సురేష్, రాజేష్ సెల్వన్‌లు అయితే ప్రాణస్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు.
 
రాజేష్ సెల్వన్ ఇంటికి సురేష్ కుమార్ తరచూ వచ్చి వెళ్లేవాడు. కరోనా సమయం కావడంతో రాజేష్ సెల్వన్ ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు సురేష్ కుమార్. వారి ఇంట్లోనే భోజనం చేయడం.. అక్కడే ఒక్కోసారి నిద్రపోవడం చేస్తుండేవాడు. దీంతో రాజేష్ సెల్వన్ ఇంట్లో పిన్ని కిలియమ్మ ఉండేది. పెళ్ళయిన నెల రోజులకే భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు.
 
దీంతో ఆమె ఒంటరిగానే ఉంటోంది. రాజేష్ సెల్వన్ ఇంట్లోనే ఉంటోంది. సురేష్ కుమార్‌కు ఆమె బాగా దగ్గరైంది. ఆ చనువు కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదిలా 7 నెలల పాటు సాగింది. రాజేష్‌కు ఎలాంటి అనుమానం రాకుండా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం కొనసాగింది.
 
అయితే అక్రమ సంబంధం ఎక్కువ రోజులు ఆగదు కదా. సరిగ్గా వారం రోజుల క్రితం ఇంట్లో వారిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చూసేశాడు రాజేష్ సెల్వన్. రాజేష్ వచ్చిన విషయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. దీంతో అతడు ఏమీ తెలియనట్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. ప్రాణస్నేహితుడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
 
మూడురోజుల క్రితం తన పుట్టినరోజు ఉండటంతో ఇంట్లో ముందుగా కేక్ కట్ చేశాడు. ఆ తరువాత సురేష్ కుమార్‌తో పాటు శ్యామ్‌ను వెంట తీసుకుని గ్రామ శివార్లలోకి వెళ్ళారు. అక్కడ ఫుల్లుగా మద్యం సేవించారు. సురేష్‌కు మోతాదుకు మించి మద్యం తాగించారు. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు.
 
కోపం కట్టలు తెంచుకున్న రాజేష్ తన దగ్గర ఉన్న కత్తితో సురేష్ మర్మాంగాన్ని రెండు ముక్కలుగా కోసేశాడు. ఆ తరువాత పొడిచి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కానీ నిందితులు ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెలగపూడి ఘటన బాధాకరం: హోంమంత్రి సుచరిత