తమిళనాడు మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తదపరి పుట్టినరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందామని ఆయన అనడం గమనార్హంగా మారింది.
తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులందరికీ కమలహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి శుభాకాంక్షలు తన పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చాయని తెలిపారు. తన బర్త్ డే రోజున సేవా కార్యక్రమంలో పాల్గొన్న తమ పార్టీ నేతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.
వారి కష్టానికి, ప్రేమకు తగిన ఫలితం దక్కేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చి కష్టపడతానని తెలిపారు. ఈ సందర్భంగా తన తదుపరి పుట్టిన రోజు తమిళనాడు సీఎం కార్యాలయంలో జరుపుకుందామని చెప్పి తమ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.