Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతిస్థిమితం లేని యువతిపై బస్సులో యువతిపై అత్యాచారం

Advertiesment
మతిస్థిమితం లేని యువతిపై బస్సులో యువతిపై అత్యాచారం
, శుక్రవారం, 9 జులై 2021 (17:08 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో మతిస్థిమితంలేని ఓ యువతిపై బస్సులో అత్యాచారం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడగడమే ఆ యువతి చేసిన తప్పు. ఇంట్లో దింపుతామని నమ్మించి బస్సులో ఎక్కించుకున్న కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కోజికొడ్‌ జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఓ యువతికి మతిస్థిమితం లేదు. ఆ యువతి తరచు తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వస్తుంది.
 
అయితే ఈ నెల 5వ తేదీన మరోసారి తన తల్లితో గొడవపడి ఊరి చివరకు వెళ్లింది. కొంతసమయం తర్వాత  తాను ఇంటికి వెళ్లాలనుకొని రోడ్డుపై పలు వాహనాలను లిఫ్ట్‌ అడిగింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్‌ ఇచ్చి ఇంటి వద్ద దింపుతామని బలవంతంగా పార్కింగ్ చేసివున్న ఓ ప్రైవేటుబస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
తర్వాత ఆమెను ఊరిలోని ఆటో స్టాండ్‌ వద్ద వదిలేసి పరారయ్యారు. అయితే జరిగిన విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని  చేవాయూర్ పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Asia Book of Records-నాలుగేళ్ల చిన్నారి యోగాలో అదుర్స్