Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చావు దగ్గరకెళ్లిన కేరళవాసికి రూ.6.67 కోట్ల బంపర్ లాటరీ...

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..

Advertiesment
చావు దగ్గరకెళ్లిన కేరళవాసికి రూ.6.67 కోట్ల బంపర్ లాటరీ...
, గురువారం, 11 ఆగస్టు 2016 (15:31 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేరళకు చెందిన బసీర్ అబ్దుల్ ఖాదర్ అనే 62 యేళ్ల వ్యక్తి దుబాయ్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఎమిరేట్ విమాన ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజులకు బంపర్ లాటరీ తగిలింది. ఈ లాటరీలో ఆయనకు ఏకంగా రూ.6.67 కోట్లు వచ్చాయి. 
 
ఇంతకీ ఈ లాటరీ టిక్కెట్ కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో అతనితో పాటు.. అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

590 అడుగుల ఎత్తులో నిలబడి వివాహం చేసుకున్నారు.. ఎక్కడ..?