Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కట్నకానుకలు వద్దన్నాడు.. రూ.15 లక్షలు ఇస్తేనే శోభనమంటున్నాడు...

honey trap

ఠాగూర్

, ఆదివారం, 7 జనవరి 2024 (08:59 IST)
బెంగుళూరుకు చెందిన ఓ ఇంజనీర్ వివాహ సమయంలో అత్తింటివారి నుంచి ఎలాంటి కట్నకానుకలు ఆశించలేదు. దీంతో వధువుతో పాటు అత్తింటి వారు ఎంతో సంతోషంగా పెళ్ళిని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత తమ అల్లుడి నిర్వాహకం బయపడింది. తనకు రూ.15 లక్షలు డబ్బులు ఇస్తేనే శోభనం గదిలోకి అడుగుపెడతానని మొండికేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు చెందిన అవినాశ్ వర్మ అనే వ్యక్తి ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గత 2022 జూన్ ఆరో తేదీన 27 యేళ్ల మహిళతో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకలు, ఇతరు లాంఛనాలు వద్దని చెప్పాడు. ఆ తర్వాత తనకు నగదు రూపంలో రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీరిస్తాని వేధిస్తున్నాడంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
భర్త ఒత్తిడిని తట్టుకోలేక పుట్టింటివారు రూ.5.8 లక్షలు కట్నం ఇచ్చారని తెలిపింది. మిగిలిన మొత్తం ఇచ్చేంత వరకు శోభన గదిలోకి అడుగుపెట్టనని భీష్మించి కూర్చొన్నాడని, పైగా, తాను స్నానాల గదిలో ఉన్న సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో కుటుంబ సభ్యుడు ఒకరు వెకిలిగా వ్యహరిస్తున్నారంటా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగుళూరులోని బసవగుడి ఠాణా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియా సాయం.. కేరళలో పోయి.. గోవాలో దొరికింది.. ఏంటిది?