టిప్పు జయంతి సభలో బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేసిన కర్నాటక మంత్రి!
కర్నాటక మంత్రి చేసిన నిర్వాకంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలపాలైంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు హాజరైన మంత్రివర్యులు... అశ్లీల
కర్నాటక మంత్రి చేసిన నిర్వాకంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలపాలైంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు హాజరైన మంత్రివర్యులు... అశ్లీల చిత్రాలు వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ మంత్రిగారి చర్య కెమెరా కంటికి చిక్కడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను గురువారం నిర్వహించింది. ఇందులో భాగంగా రాయచూరు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సభలో విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ పాల్గొన్నారు. ఓ వైపు ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటనలు జరుగుతాయోనని ప్రభుత్వం, పోలీసులు ఎంతో అప్రముత్తంగా ఉంటే... ఆయన మాత్రం నిర్లక్ష్యంగా వేదికపైనే ప్రముఖుల మధ్య కూర్చుని ఫోన్‌లో అశ్లీల చిత్రాలను వీక్షించారు.
మంత్రి తదేకంగా తన ఫోన్ వైపేచూస్తుండటాన్ని గుర్తించిన మీడియా క్లోజప్ చిత్రీకరించింది. ఇది పలు ఛానెళ్లలో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. మంత్రి తన్వీర్‌సే తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ మంత్రులు నీలి చిత్రాలు చూశారని.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్రస్థాయిలో పోరాటం చేసిందని, ముగ్గురు మత్రులు రాజీనామా చేసేంతవరకు వదలలేదని గుర్తు చేశారు.