Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమిస్తే చావాల్సిందే... దుడ్డుకర్రతో కూతురు తలపై కొట్టి చంపిన తల్లి...

ప్రేమంటే ఎందుకో పెద్దలు ఓ పట్టాన అంగీకరించరు. చాలా ప్రేమ వ్యవహారాలు ట్రాజెడీలుగానే మిగులుతుంటాయి. మరికొన్ని ప్రేమకథలు ఒకరికొకరు హత్యలు చేసుకునే దాకా వెళ్తాయి. మరికొన్ని ఆత్మహత్యల బాట పడతాయి. మొత్తమ్మీద ప్రేమంటే చంపడం లేదంటే చావడం అవుతోంది. తాజాగా కర్

ప్రేమిస్తే చావాల్సిందే... దుడ్డుకర్రతో కూతురు తలపై కొట్టి చంపిన తల్లి...
, బుధవారం, 7 జూన్ 2017 (12:47 IST)
ప్రేమంటే ఎందుకో పెద్దలు ఓ పట్టాన అంగీకరించరు. చాలా ప్రేమ వ్యవహారాలు ట్రాజెడీలుగానే మిగులుతుంటాయి. మరికొన్ని ప్రేమకథలు ఒకరికొకరు హత్యలు చేసుకునే దాకా వెళ్తాయి. మరికొన్ని ఆత్మహత్యల బాట పడతాయి. మొత్తమ్మీద ప్రేమంటే చంపడం లేదంటే చావడం అవుతోంది. తాజాగా కర్నాటకలో నవమాసాలు మోసి కని పెంచిన కుమార్తె ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక దుడ్డుకర్రతో మోది చంపిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలో కోలారు జిల్లా కేంద్రం సమీపంలోని చిన్నాపుర గ్రామంలో విధవరాలు వెంకటమ్మ వుంటోంది. ఆమెకు 18 ఏళ్ల కుమార్తె రాజశ్వరి వుంది. ఈమె కోలారులోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో రాజేశ్వరి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం తెలుసుకున్న తల్లి ఆమెను వారించింది. ప్రేమాగీమా అంటే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పింది. ఐనా కుమార్తె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యింది. దీనితో తల్లి ఆవేశం కట్టలు తెంచుకుంది. 
 
కుమార్తెతో గొడవకు దిగింది. ప్రేమించి యువకుడితో దూరంగా వుండకుండా వున్నందుకే చదువులో చతికిలపడ్డావని మండిపడింది. ఈ విషయంలో మాటా మాటా పెరగడంతో మూలనున్న దుడ్డుకర్రను తీసి కుమార్తె తలపై బలంగా కొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఇదేమీ పట్టించుకోకుండా శవాన్ని నట్టింట్లో పెట్టుకుని నిద్రపోయింది. ఉదయాన్నే తన కుమార్తె చనిపోయిందంటూ పెద్దగా కేకలు వేస్తూ బోరున విలపించింది. ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసేసరికి తన కుమార్తెను తనే హత్య చేసినట్లు అంగీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 3న రజినీ రాజకీయ ప్రవేశం... అల్లుడు ధనుష్‌కి ఎందుకు అంత ఆత్రం?