దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కేరళ సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశంలో ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న రాష్ట్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. దీంతో కేరళలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.
దేశంలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లు కలిగిన ఏకైక రాష్ట్రం కేరళ కావడం విశేషం. ఈ ఎయిర్ పోర్ట్‌ను రెండు వేల ఎకరాల్లో రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళలో ఇప్పటికే తిరువనంతపురం, కొచ్చిన్, కోళికోడ్ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి.
కన్నూర్ ఎయిర్ పోర్ట్ ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, కాంగ్రెస్ బాయ్ కాట్ చేశాయి.