Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నడ హీరోయిన్ రేప్ కేసు... రైల్వే మంత్రి కొడుక్కి బెయిల్

Advertiesment
kannada heroine maitreya sadandanda gowda rape karthik gowda case bail bangalore
, సోమవారం, 8 సెప్టెంబరు 2014 (20:02 IST)
కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ ఆరోపించిడమే కాకుండా ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. దీనితో మైత్రేయ కేసు కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో బజారున పడేలా చేసేసింది. మైత్రేయ కేసుపై ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించారు.
 
కాగా తనయుడు కార్తీక్ గౌడపై వస్తున్న ఆరోపణలపై ప్రత్యేకంగా చెప్పేదేమీలేదని కేంద్రమంత్రి సదానంద గౌడ అన్నారు. మోడల్ మైత్రేయ ఫిర్యాదు విషయంపై గౌడ సోమవారం స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు.  
 
ఇంతకుముంది నేను చెప్పేందుకు ఏమీ లేదన్నారు. వంద రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో తన శాఖ గురించి సదానంద సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా తన తనయుడి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయంపై చెప్పేందుకు ఏదీ లేదన్నారు. 
 
కాగా నటి, మోడల్ మైత్రేయ కేసులో కేంద్ర రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు సోమవారం ముందస్తు బెయిల్ వచ్చింది. బెంగళూరు సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, నటి, మోడల్, మైత్రేయ.. కార్తీక్ గౌడ పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు దీని పైన విచారణ జరుపుతున్నారు. సదానంద గౌడకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu