Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైరాకు కంగనా మద్దతు: వాడు అమాయకుడా? నేనైతే వాడి కాళ్లు విరగ్గొట్టేదాన్ని

దంగల్ నటి జైరా వసీమ్‌ పబ్లిసిటీ కోసం చేసిందని.. విమానంలో జైరా తనను వేధించినట్లు చెప్తున్న వ్యక్తి అమాయకుడని వార్తలొస్తున్నాయి. జైరాను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్‌కు మద్దతుగా #Justice4Vik

Advertiesment
జైరాకు కంగనా మద్దతు: వాడు అమాయకుడా? నేనైతే వాడి కాళ్లు విరగ్గొట్టేదాన్ని
, గురువారం, 14 డిశెంబరు 2017 (16:31 IST)
దంగల్ నటి జైరా వసీమ్‌ పబ్లిసిటీ కోసం చేసిందని.. విమానంలో జైరా తనను వేధించినట్లు చెప్తున్న వ్యక్తి అమాయకుడని వార్తలొస్తున్నాయి. జైరాను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్‌కు మద్దతుగా #Justice4Vikas అనే హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చేసింది.

జైరాపై కాలు అనుకోకుండా తాకిందని వెంటనే వికాస్ సారీ చెప్పాడని అదే విమానంలో ప్రయాణించిన వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పటికే వికాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. తాజాగా జైరాకు మద్దతుగా క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్ మద్దతు పలికారు. 
 
తాను విమానంలో ప్ర‌యాణిస్తోన్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. సోషల్ మీడియా లైవ్‌ ద్వారా తెలిపిన జైరా వ్యవహారంపై  కంగనా నోరువిప్పింది. తనకు జరిగిన దారుణాన్ని బయటికి చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. 
 
జైరా వసీమ్‌దే తప్పని ఎందుకు అంటున్నారని అడిగింది. వేధింపుల‌కు గురైన‌ విషయాలు ఎందుకు ఓపెన్‌గా చెప్పేస్తున్నావని అమ్మాయిలను నియంత్రించడం సబబు కాదని కంగనా తెలిపింది. ఆడ‌పిల్ల‌లు వేసుకునే దుస్తులు, చేసే పనులు ఓ వ్యక్తి త‌న‌పై లైంగిక దాడి చేయడానికి ఎలా కార‌ణ‌మ‌వుతాయ‌ని అడిగింది. జైరా స్థానంలో తాను వుంటే వేధించిన వాడి కాళ్లు విరగ్గొట్టేదానిని అంటూ కంగనా మండిపడింది.
 
అంతటితో ఆగకుండా వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు చెప్తుంటే.. ఎవడో తోటి ప్రయాణీకుడు వికాస్ అమాయకుడని వాంగ్మూలం ఇస్తాడా? అమాయకుడైతే కాలితో అమ్మాయి వీపు భాగాన్ని నిమురుతాడా? అంటూ కంగనా ప్రశ్నించింది. వేధింపులు తాళలేక కన్నీళ్లు పెట్టుకున్న జైరా పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేసిందంటారా? అంటూ కంగనా మీడియా ముందు మండిపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కండోమ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్... ఖజురహోను ఏం చేస్తారో?