Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 16 వర్షం కురిశాక 'సూరీడు'ను కమ్మేసిన 'రెండాకులు'... ఎందుకిలా జరిగింది...?

తమిళనాడులో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరో చరిత్ర. తమిళ ఓటర్లు లిఖించిన తీర్పు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఉద్దండ సంస్థలకు అంతుచిక్కలేదు. ఐతే ముఖ్యమంత్రి జయలలిత మరోసారి విజయం సాధించబోతున్న సంగతి వెబ్ దునియా తెలుగు ముందే పసిగట్టింది. ఓటింగ్ సరళిరోజున మరోసారి

Advertiesment
Jayalalithaa party
, గురువారం, 19 మే 2016 (13:11 IST)
తమిళనాడులో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరో చరిత్ర. తమిళ ఓటర్లు లిఖించిన తీర్పు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఉద్దండ సంస్థలకు అంతుచిక్కలేదు. ఐతే ముఖ్యమంత్రి జయలలిత మరోసారి విజయం సాధించబోతున్న సంగతి వెబ్ దునియా తెలుగు ముందే పసిగట్టింది. ఓటింగ్ సరళిరోజున మరోసారి జయలలిత విజయం సాధించబోతున్నట్లు కథనాన్ని సైతం ప్రచురించింది. ఇకపోతే... మే 16న తమిళనాడులో భారీ వర్షం కురిసింది. అప్పటిదాకా సూర్యుడు(డీఎంకె) బాగా విజృంభించాడు. 
 
వర్షం మొదలయ్యేసరికి మేఘాల చాటుకు వెళ్లక తప్పలేదు. అక్కడే మొదలైంది. రెండాకులు(అన్నాడీఎంకె) వానకు తడిసి ఓట్ల వర్షంలో ముద్దయ్యాయి. వర్షం ముగిశాక జరిగిన పోలింగ్ అంతా అమ్మ జయలలితకు అనుకూలంగా పోలైనట్లు లోకల్ ఛానళ్లు సైతం వెల్లడించాయి. అదే జరిగింది. నిజానికి డీఎంకే 124 నుంచి 140 సీట్లు సాధిస్తుందని ఫలితాన్ని ఊహిస్తూ, యాక్సిస్ - మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది. 
 
ఇంకా డీఎంకే 118 సీట్లు గెలుస్తుందని న్యూస్ నేషన్ సర్వే చెబితే డీఎంకే కూటమికి 145 సీట్లు వస్తాయని ఇండియా టుడే తెలిపింది. కానీ లోకల్ మీడియా మాత్రం జయలలితదే విజయమని తేల్చాయి. అనుకున్నట్లే జయలలిత 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు విజయం సాధించడమనే ఫీట్ ను చేసి చూపించారు. ప్రస్తుతం అన్నాడీఎంకె 126 చోట్ల విజయం దిశగా దూసుకు వెళుతుండగా డీఎంకె 104 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం పాలేరు బైపోల్ : తెరాస అభ్యర్థి తుమ్మల విజయభేరీ