Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంధ బాలికపై అత్యాచారం చేసిన ఆర్మీ జవాను.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు!

అంధురాలైన ఓ అభాగ్యురాలిపై అత్యాచారానికొడిగట్టాడో ఆర్మీ జవాను. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... యూపీలోని రామ్ నగ్లా గ్రామానికి చెందిన అజిత్ చౌదరి (35) ఆర్మీలో ఉద్యోగ

Advertiesment
అంధ బాలికపై అత్యాచారం చేసిన ఆర్మీ జవాను.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు!
, సోమవారం, 8 ఆగస్టు 2016 (16:02 IST)
అంధురాలైన ఓ అభాగ్యురాలిపై అత్యాచారానికొడిగట్టాడో ఆర్మీ జవాను. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... యూపీలోని రామ్ నగ్లా గ్రామానికి చెందిన అజిత్ చౌదరి (35) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దళిత అంధ బాలికపై అతను మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ బాలికి ఇంటిలో చొరబడ్డాడు. ఇంట్లో అందరూ ఉండగానే ఆమెను టెర్రస్ పైకి ఈడ్చుకుని వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో బాధితురాలి ముసలి తండ్రి, వదిన కూడా ఉన్నారు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైయ్యారు.
 
దీంతో బాలిక తండ్రి ఇరుగు పొరుగుని పిలవడానికి వెళ్లాడు. ఇంతలోపే ఆ జవాను బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా వదిలేశారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఒత్తిడి పెరగడంతోనిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. యేడాదిన్నర వయసున్న బిడ్డ కడుపులో 3.5 కేజీల పిండం!