Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్.. ఎలాగంటే..?

Advertiesment
270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్.. ఎలాగంటే..?
, సోమవారం, 17 మే 2021 (10:41 IST)
కోవిడ్ బాధితులకు వైద్యులు అండగా నిలుస్తున్నారు. అలాగే ఓ డాక్టర్ తాజాగా 270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జలగావ్ ఆసుపత్రిలో డాక్టర్ సందీప్ పని చేస్తున్నారు. 2021, మే 13వ తేదీ గురువారం ప్రభుత్వ వైద్య కశాశాలలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావచ్చింది. 
 
అప్పటికే ఆ ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి. దీనిని డాక్టర్ సందీప్ బృందం గుర్తించింది. వెంటనే రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడారు. ఇంటి నుంచి తెగ ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే సందీప్ జన్మదినం. కుటుంబసభ్యులు ఫోన్ చేసినా..తాను పనిలో బిజీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయొద్దు..అని సున్నితంగా చెప్పారు.

దాదాపు 8 గంటల పాటు సందీప్ బృందం శ్రమించింది. విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు. అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారులను కూడా వదలని కరోనా రక్కసి.. వెయ్యిమందికి..?