Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం పట్టుకునేందుకు ఒక్కరూ ఉండరు : సీఎం మెహబూబా

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు.

Advertiesment
కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం పట్టుకునేందుకు ఒక్కరూ ఉండరు : సీఎం మెహబూబా
, శనివారం, 29 జులై 2017 (09:09 IST)
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ప్రజలకున్న ప్రత్యేక హక్కులను తారుమారు చేస్తే త్రివర్ణ పతాకం పట్టుకోవడానికి రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. ఓవైపు రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అంటుంటాం.. మరోవైపు అదే రాజ్యాంగాన్ని చితకబాదుతుంటారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే 35ఏ అధికరణాన్ని రద్దు చేయాలన్న వాదనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి మాటలతో వేర్పాటువాదులకేమీ కాదు.. భారత్‌లో కొనసాగాలనుకునే మాలాంటివారిని ఇబ్బందుల్లో పెడుతున్నారు అని మెహబూబా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్... షీనాకు మెడిసన్ కాక్‌ టెయిల్ ఇచ్చి గొంతునులిమి చంపేశారు