దేశంలో వందే భారత్ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా సేవల కోసం ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ యేడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సన్నాహాలు. తొలుత 12 కోచ్‌లతో మెట్రో రైళ్లు పరుగులు డిమాండ్ పెరిగితే 16 కోచ్‌లకు పెంచాలని యోచిస్తుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ యేడాది జైలు నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపారు.
వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాఫ్‌లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవరాలను దృష్టిలో పెట్టుకుని వందే మెట్రోలలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
ఈ యేడాది ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్ళలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలను అతి త్వరలో ప్రజలతో పంచుకుంటాం అని ఆయన తెలిపారు. అలాగే, ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకునిరావాలనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు.