Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గిన్నిస్ రికార్డు కోసం వెంట్రుకలు 60 అడుగుల పొడవు పెంచాడు!

Advertiesment
Indian man
, శనివారం, 4 జూన్ 2016 (10:35 IST)
సాధారణంగా జుట్టు పెంచుకోవడం ఆడవాళ్లకి అందాన్నిస్తుంది. అదే మగవాళ్లకి పూర్తి భిన్నం. కొంచెం జుట్టు పెరిగిన వెంటనే వెళ్లి కత్తిరించుకుంటారు. ఇంకా వేసవికాలంలోనైతే చెప్పనక్కరల్లేదు. కాకపోతే దేవుడికి తలనీలాలు ఇస్తానని మొక్కుకుంటే తప్ప జుట్టుపెంచుకోం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 అడుగులు పొడవు జుట్టుని ఒక మనిషి పెంచుకుంటున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నానిజం. 
 
ఆ వ్యక్తి పేరు సావిభాయి రత్వా.. వయస్సు 60 ఏళ్లు.. గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ఆయన తల వెంట్రుకల పొడవు 62 అడుగులు. అతడు జుట్టు పెంచుకున్న విధం చూస్తే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జుట్టుని కత్తిరించాడో లేదో అనే అనుమానం కలగడం ఖాయం. తన జుట్టును ఏ విధంగా సంరక్షించుకుంటున్నాడో తెలుసా... తాను బయటకు వెళ్లేటప్పుడు తన కేశాలను తాడు చుట్టినట్లుగా చుట్టి చేతికి తగిలించుకుని వెళతానని, ఒక్కోసారి ఈ కేశాలనే తలపాగాగా చుట్టుకుంటానని తెలిపారు. 
 
తన కేశాలు బలంగా ఉండటం కోసం పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకుంటానని వెల్లడించాడు. కేశ సంరక్షణ విషయానికొస్తే, రెండు రోజులకొకసారి తలస్నానం చేస్తానని, ఆ కేశాలను ఆరబెట్టేందుకు తన మనవలు సహకరిస్తారని తెలిపారు. ఆహారపదార్థాల విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తాడట. రోజుకు మూడు గంటలు తన కేశాలను శుభ్రం చేసుకునేందుకు సమయాన్నికేటాయిస్తాడట. 
 
జుట్టును ఇంటిముందు వేలాడదీశాడంటే దుస్తులు ఆరేసుకునే పెద్ద తాడులా అది దర్శనం ఇస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడు మాంసాహారాన్నిఅస్సలు ముట్టడట. కాగా ఇంటి భోజనం మాత్రమే తింటాడని చెప్పుకొచ్చాడు. ఇదంతా ఎందుకో తెలుసా... గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగబిడ్డ పుట్టలేదని భార్యను చంపేసిన భర్త