Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుకుంటే అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌

బారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సాధిస్తున్న అనితరసాధ్యమైన విజయాలను అంతర్జాతీయ మీడియా పాక్షిక దృక్పధంతో తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తల్లో అంతరిక్ష విజయాలపై ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. అమెరికా, రష్యాలకు ధీటుగా అంతరిక్ష కేంద్రాన్న

Advertiesment
అనుకుంటే అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌
హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (04:24 IST)
బారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సాధిస్తున్న అనితరసాధ్యమైన విజయాలను అంతర్జాతీయ మీడియా పాక్షిక దృక్పధంతో తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తల్లో అంతరిక్ష విజయాలపై ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. అమెరికా, రష్యాలకు ధీటుగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యం కూడా తమకుందని వారు సగర్వంగా చాటుతున్నారు. 
 
ఇండోర్‌ భారత్‌కు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యముందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్  కిరణ్‌ తెలిపారు. అయితే ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ఇండోర్‌లో సోమవారం జరిగిన రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన కిరణ్‌ కుమార్‌..ఇస్రో సామర్థ్యానికి ఆకాశమే హద్దు అన్నారు.
 
‘అంతరిక్ష కేంద్రం నిర్మించే సామర్థ్యం మనకుంది. దేశం నిర్ణయం తీసుకున్న రోజు మేం ప్రాజెక్టును స్వీకరిస్తాం. ఇందుకోసం విధి విధానాలను రూపొందించి కావాల్సిన నిధులు, సమయం ఇస్తే చాలు’ అని తెలిపారు. మానవరహిత అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగమేంటనే అంశంపైనా ఇంకా చర్చిస్తున్నామని అందుకే ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్  నెట్‌వర్క్‌ రంగాల్లో విస్తృత పరిశోధనలకోసం మరిన్ని ఉపగ్రహాలను పంపించాల్సిన అవసరం ఉందన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ అన్న కుమారుడు దీపక్‌కు శశికళ ఏం మంత్రం వేసిందో? కరివేపాకులా వాడుతోందా?