Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్‌పై సామూహిక అత్యాచారం..

Advertiesment
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్‌పై సామూహిక అత్యాచారం..
, సోమవారం, 25 మార్చి 2019 (17:24 IST)
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. మృగాళ్లు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చివరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగిని కూడా విడిచిపెట్టలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది.


మీరట్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడికట్టడం కలకలం రేపింది. కాగా నిందితుల్లో డాక్టరు కూడా ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. శనివారం రాత్రి ఈ దారణమైన ఘటన జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు బాధిత మహిళ శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిందని, ఆ తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమెను జాగ్రత్తగా కాపాడాల్సిన హాస్పిటల్ సిబ్బంది ఆమెపై ఈ నీచానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసామని, దర్యాప్తును చేపట్టామని సీనియర్ అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ముందస్తుగా ఓ పథకాన్ని రచించి, దాని ప్రకారం మత్తు ఇంజక్షన్ ఇచ్చి, అలాగే సీసీటీవీని ఆఫ్ చేసి అత్యాచారనికి ఒడిగట్టారని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందం ఒక మహిళతో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణను వేగవంతం చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు గంటలపాటు నిర్విరామంగా శృంగారం.. చివరికి గుండె ఆగిపోయింది...