Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత నోట్లున్నా జైలు శిక్ష లేదు.. రూ.10వేలు మాత్రమే జరిమానా.. ఆర్డినెన్స్ తొలగింపు..

నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలో ప‌రిస్థితిని ప్ర‌తీ రోజూ కేంద్రం స‌మీక్షిస్తోంది. దానిక‌నుగుణంగా రోజూ త‌గు నిర్ణ‌యాలు తీసుకుంటుంది. న‌గ‌దు మార్పిడి ప‌రిమితి తగ్గింపు, పెళ్లిళ్ల‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల విత్

Advertiesment
How I Illegally Convert Old Notes Into New: An Insider Explains
, శుక్రవారం, 30 డిశెంబరు 2016 (09:20 IST)
నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలో ప‌రిస్థితిని ప్ర‌తీ రోజూ కేంద్రం స‌మీక్షిస్తోంది. దానిక‌నుగుణంగా రోజూ త‌గు నిర్ణ‌యాలు తీసుకుంటుంది. న‌గ‌దు మార్పిడి ప‌రిమితి తగ్గింపు, పెళ్లిళ్ల‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల విత్ డ్రా అవ‌కాశం… పాత నోట్లతోనే రైతులు విత్త‌నాలు కొనుక్కునే వెసులుబాటు ఇలా రోజూ ఏదోక నిర్ణ‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తోంది. తాజాగా పదికి మించి రద్దు చేసిన పాత నోట్లున్నా.. రూ.10వేల జరిమానా మాత్రమే విధిస్తారు.
 
ఈ మేరకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలన్న నిబంధనను ఆర్డినెన్స్ నుంచి తొలగించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ తాజాగా ఆర్డినెన్సును ఆమోదించింది. పాత కరెన్సీ పది నోట్లకు మించి ఉంటే మాత్రం పది వేలు ఫైన్‌గా చెల్లించుకోవలసిందే.
 
ఈ ఆర్డినెన్సును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారని, ఈ నెల 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిసింది. రద్దయిన 500, వెయ్యి నోట్లు మార్చి 31 తరువాత కనిపిస్తే అది క్రిమినల్ నేరమే అవుతుందని కేంద్రం తెలిపింది. అలా కనిపిస్తే భారీ జరిమానా (గరిష్టంగా 50 వేల వరకు) విధిస్తారు. జనవరి 1-మార్చి 31 మధ్య పాత కరెన్సీ డిపాజిట్ చేయవలసి వస్తే (అత్యవసర సందర్భాల్లో) తప్పుడు సమాచార మిచ్చినవారికి రూ.5 వేలు, అంతకన్నా ఎక్కువగా ఫైన్ విధిస్తారు. ఈ ఆర్డినెన్సును పార్లమెంటు ఆరు నెలల్లోగా చట్టంగా మార్చాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంసం ముద్దతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం ఇష్టం లేదు.. రోబోతో లిల్లీ పెళ్ళి?