Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైరస్ మిస్త్రీ తొలగింపు రతన్ టాటా ఎంతో కష్టంగా తీసుకున్నదా?

Cyrus Mistry

ఠాగూర్

, ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:21 IST)
టాటా సన్స్ చైర్మన్‌గా సరైస్ మిస్త్రీని రతన్ టాటా తొలగించారు. నిజానికి సైరస్ మిస్త్రీ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందే రతన్ టాటా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు రతన్ టాటా ఎంతో మథనపడ్డారని "రతన్ టాటా ఏ లైఫ్" అనే పుస్తకంలో పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఓ పుస్తకంలోని వివరాల ఆధారంగా ఈ తెలుస్తోంది. 
 
టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 2012 డిసెంబరులో రతన్‌ టాటా పదవీ విరమణ చేశారు. రతన్‌ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేందుకు 2011లోనే సైరస్‌ మిస్త్రీని ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టక ముందు ఏడాది పాటు భావి ఛైర్మన్‌ డిజిగ్నేట్‌గా మిస్త్రీ ఉన్నారు. ఆ సమయంలోనే సంస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో సూచనలు, సలహాలు పొందేందుకు, అనుభవాల వివరాలు తెలుసుకునేందుకు రతన్‌ కింద ఆయన అప్రెంటిస్‌షిప్‌ చేశారు. 
 
అయితే ఆ యేడాది ముగింపు నాటికి మిస్త్రీ ఈ పదవికి సరైన వ్యక్తేనా అని రతన్‌ పునరాలోచనలో పడినట్లు 'రతన్‌ టాటా ఏ లైఫ్‌' పుస్తకం వెల్లడించింది. ఇటీవల దివంగతులైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జీవితంపై థామస్‌ మ్యాథ్యూ ఈ పుస్తకాన్ని రాశారు. దీనిని హార్పర్‌కొల్లిన్స్‌ పబ్లిషర్స్‌ ప్రచురించింది. 
 
2016 అక్టోబరులో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించేందుకు నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఒక విధంగా మిస్త్రీ కంటే రతన్‌కే ఎక్కువ కష్టంగా అనిపించిందని హార్వర్డ్‌ బిజినినెస్‌ స్కూల్‌ మాజీ డీన్‌ నితిన్‌ నోహ్రియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ పుస్తకం పేర్కొంది. టాటా సన్స్‌లో డైరెక్టరుగా ఉన్న వేణు శ్రీనివాసన్‌ ఇదే తరహా విషయాన్ని వెల్లడించినట్లు ఆ పుస్తకం తెలిపింది. 
 
డైరెక్టర్ల నుంచి విశ్వాసం కోల్పోయినట్లు స్పష్టంగా తెలిసినప్పుడు మిస్త్రీ హుందాగా ఆ బాధ్యతల నుంచి వైదొలిగితే బాగుండేదని రతన్‌ కోరుకున్నారని వెల్లడించింది. కానీ అలా జరగలేదని, టాటా సన్స్ బోర్డు డైరక్టర్లంతా కలిసి సైరస్ మిస్త్రీని తొలగించారు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు