Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు హిజాబ్‌ వివాదంపై కర్నాటక కోర్టు కీలక తీర్పు

Advertiesment
Hijab Verdict
, మంగళవారం, 15 మార్చి 2022 (08:13 IST)
దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, తీర్పుతో నిమిత్తం లేకుండా ఇరు వర్గాలను అదుపు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తును ఏర్పాటుచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బగాలను మొహరించింది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే పలు ఆంక్షలను అమల్లోకి వచ్చేశాయి. 
 
మరోవైపు, హిజాబ్ వివాదం రేగిన దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం జరుగనున్న పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని అన్ని విద్యా సంస్థలను ఆయన కోరారు. 
 
మరోవైపు, హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగుళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఒక వారం రోజుల పాటు బెంగుళూరు నగరంలో ఎలాంటి సమావేశాలుగానీ, నిరసనలు గానీ, జనం గుమికూడటానికిగానీ అనుమతించబోమని ఓ ప్రకటనలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీ: సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అంతర్జాతీయ రికార్డు