Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

కొత్త పెళ్లి కూతురిలా అన్నీ వివరించాలా? మహిళా ఐఏఎస్ అధికారిణిని?

మహిళలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులు, హత్యలతో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ఐఏఎస్ అధికారి ఒ

Advertiesment
Haryana
, సోమవారం, 11 జూన్ 2018 (09:38 IST)
మహిళలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులు, హత్యలతో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ఐఏఎస్ అధికారి ఒకరు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఫేస్‌బుక్ తన గోడును ఇలా చెప్పుకుంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 
 
గత నెల 22న సదరు అధికారి తనను ఆయన కార్యాలయానికి పిలిపించుకుని బెదిరించారని బాధిత అధికారిణి (28) తెలిపింది. ఆయా విభాగాలు చేసిన తప్పుల గురించి ఫైల్స్ ఎందుకు సిద్ధం చేస్తున్నారని ప్రశ్నించారని.. ఆ పనిని ఆపాల్సిందేనని హెచ్చరించినట్లు బాధితురాలు వెల్లడించింది. ఆ వేధింపులు అంతటితో ఆగలేదని.. గత నెల 31న మరోసారి గదికి పిలిచి వేధించారని.. గదిలోకి ఎవరినీ పంపవద్దని సిబ్బందికి సూచించినట్లు అధికారిణి తెలిపింది. 
 
డబుల్ మీనింగ్ మాటలు, కొత్త పెళ్లి కూతురిలా అన్నీ వివరించాల్సి వస్తోందని పై అధికారి తన అన్నట్లు బాధితురాలు వాపోయింది. ఇంకా ఈ నెల 6వ తేదీన సాయంత్రం మళ్లీ తన గదికి పిలిచి రాత్రి వరకు ఉండమన్నారని, తన వద్దకు వచ్చేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు వెల్లడించింది. అయితే, తనపై మహిళా ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలను సీనియర్ అధికారి కొట్టిపడేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ.. రోడ్డు డివైడర్‌పై శృంగారం