విమానంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో విమానయానం చేసే అయ్యప్ప భక్తులను తమతో పాటు ఇరుముడిని తీసుకుని వెళ్లే అవకాశం వుండేది కాదు, ఐతే ఇకపై భక్తుల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఇరుముడితో పాటు అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు.
భద్రతా నియమాలను సవరించి ఈ మార్పులు తీసుకుని వచ్చామనీ, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు. కూటమి ప్రభుత్వం భక్తుల అవసరార్థం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.