బంగారు మరుగుదొడ్డి చోరీకి గురైంది. లండన్‌లోని బ్లనియమ్ ప్రాసాదంలోని మ్యూజియంలో ఉన్న ఈ గోల్డ్ మరుగుదొడ్డి చోరీకి గురైంది. 18 కేరెట్ల బంగారంతో చేసిన ఈ టాయిలెట్ ధర రూ.8.8 కోట్లు. న్యూయార్క్‌లోని సోలోమన్ ఆర్ గుగెన్‌హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చి ప్రదర్శనశాలలో ఉంచారు.
నిజానికి వచ్చే నెల 27వరకు దీనిని ఇక్కడే ఉంచాలని మ్యూజియం నిర్వాహకులు భావించారు. కానీ వున్నట్టుండి దానిని దొంగలు ఎత్తుకుపోవడంతో కలకలం రేగింది. బంగారు టాయిలెట్ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న లండన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
దొంగతనానికి దుండగులు రెండు వాహనాలను వాడారని, లోతైన దర్యాప్తు నిర్వహించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. దొంగతనం నేపథ్యంలో అధికారులు శనివారం బ్లెన్హీవ్ ప్యాలెస్‌ను మూసివేశారు. పర్యాటకులను అనుమతించలేదు. కాగా, అమెరికాలోని న్యూయార్క్‌లో సాలమన్ గుగ్గెన్ హీవ్ మ్యూజియంలో ఇటీవలే ఈ టాయిలెట్‌ను ప్రదర్శించారు.