కోర్కె తీర్చలేదని స్నేహితురాలి అసభ్య ఫోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్.. యువతి ఆత్మహత్య
సోషల్ మీడియా. ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో తమ గుప్పెట్లో ఉంచుతున్న సామాజికమాధ్యం. అయితే, దీన్ని కొందరు కామాంధులు మరోలా ఉపయోగిస్తూ... పలువురి మరణాలకు కారణభూతులవుతున్నారు. తాజా, తన కోర్కె తీర్చలేదన్న అక
సోషల్ మీడియా. ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో తమ గుప్పెట్లో ఉంచుతున్న సామాజికమాధ్యం. అయితే, దీన్ని కొందరు కామాంధులు మరోలా ఉపయోగిస్తూ... పలువురి మరణాలకు కారణభూతులవుతున్నారు. తాజా, తన కోర్కె తీర్చలేదన్న అక్కసుతో ఓ యువతి అసభ్య ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడో యువకుడు. అది చూసిన ఆ యువతి అవమానం భరించలేకు ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ళ యువకుడు, 17 ఏళ్ళ యువతి రెండేళ్ళ కిందట ప్రేమించుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇటీవల విడిపోయారు. అయితే నాటి నుంచి ఆ యువకుడు ఆమెను మానసికంగా హింసిస్తూ బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో తన కోర్కె తీర్చాలని ఆదివారం రాత్రి యువతిని బెదిరించాడు.
దీనికి ఆ యువతి ససేమిరా అనండంతో అమె అశ్లీల ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది గమనించిన ఆమె తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అవమానం తట్టుకోలేక ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సైబర్ క్రైం కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.