Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో వివాదంలో సాక్షి మహారాజ్ : ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని..?!

Advertiesment
Girl forced to unbutton her jeans in front of BJP MP Sakshi Maharaj
, శుక్రవారం, 6 మే 2016 (18:00 IST)
బీజేపీ వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. కొంతమంది మహిళలతో మాట్లాడుతూ.. ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని చూపించాల్సిందిగా సాక్షి అడగడం వీడియో రికార్డు కావడంతో వివాదం రాజుకుంది.
 
గాయాలతో ఉన్న బాలికను అందరూ చూస్తుండగానే శరీరంపై గాయాలను ప్యాంటు తీసి చూపించాల్సిందిగా మహారాజ్ ఆదేశించడం సభ్య సమాజం తలదించుకునేలా చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇకపోతే, యూపీ పోలీసులు సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల్ని దుర్భాషలాడటంతో పాటు 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించడమే సాక్షిపై కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణమని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టాక్ మార్కెట్ : నష్టాల్లో సెన్సెక్స్.. పెరిగిన పసిడి ధర