Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డంప్‌ల్లో కోట్లు కోట్లు.. మావోల డబ్బంతా గోవిందా.. పెద్ద నోట్ల రద్దుతో మోడీ షాక్..

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మావోయిస్టులకు గట్టి దెబ్బ కొట్టారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. జన జీవన స్రవంతిలో కలవని మావోయిస్టుల పార్టీకి మోడీ పెద్ద నోట్ల నియంత్రణ గట్టి దెబ్బే

Advertiesment
Funds tap turns dry for terror and Maoist groups after demonetisation
, గురువారం, 17 నవంబరు 2016 (09:40 IST)
పెద్ద నోట్ల రద్దుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మావోయిస్టులకు గట్టి దెబ్బ కొట్టారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. జన జీవన స్రవంతిలో కలవని మావోయిస్టుల పార్టీకి మోడీ పెద్ద నోట్ల నియంత్రణ గట్టి దెబ్బే తీసింది. మావోయిస్ట్ పార్టీ ఇతరత్రా కార్యకలాపాల కోసం దాచి ఉంచిన డంప్‌లో కోట్లాది రూపాయలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
దశాబ్దాల నుంచి మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడటం, కరవు దాడులు, పారిశ్రామిక వేత్తలు, బీడీ ఆకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్థుల నుంచి బలవంతపు వసూళ్ల ద్వారా సంపాదించిన సొమ్మంతా అటవీ ప్రాంతాల్లోని డంపులలో దాచి ఉంచారని ఈ డబ్బు ప్రస్తుతం మార్పిడికి నోచులేకపోయిందని జాతీయ మీడియా పేర్కొంది. 
 
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ - 2013 నివేదికలో మావోయిస్టులు ఏటా 140 కోట్ల రూపాయల బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు పేర్కొంది. అయితే బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు మావోయిస్ట్ కార్యకలాపాలకు కోలుకోని దెబ్బ తగిలినట్టు ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక పేర్కొన్నట్టు సమాచారం.
 
నక్సల్స్‌కు గట్టిపట్టు ఉండే రెడ్ కారిడార్‌... ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిషా అటవీ ప్రాంతాల్లోని డంపుల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున దాచి ఉంచిన రూ. 500,1000 రూపాయల నోట్లు ఎందుకూ పనికి కాకుండా పోయాయని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో మరో హిట్ రన్ కేసు.. తప్పతాగి కారు నడిపిన మహిళ.. ఇద్దరు కూలీలు మృతి..