కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి.. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా?
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే (61) హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం దవే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయి
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే (61) హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం దవే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. దవే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా అనిల్ మాదవ్ దవే మధ్యప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆర్ఎస్ఎస్తో దవేకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గతేడాది జులైలో కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా.. దవే పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
అనిల్ మాదవ్ దవే మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే మృతితో షాక్కు గురైనట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన పనితీరు పట్ల ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు. మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు దవే మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.