Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఎన్.శేషన్ చేసిన దాంట్లో పదోవంతైనా చేయలేరా? ఈసీపై హైకోర్టు ఫైర్

Advertiesment
West Bengal
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (07:34 IST)
కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ హైకోర్టు మండిపడింది. మాజీ సీఈసీ టీఎన్ శేషన్ చేసినదాంట్లో కనీసం పదో వంతైనా చేయలేరా అని నిలదీసింది. కేవలం సమావేశాలు నిర్వహించిన, ఆదేశాలు జారీచేయడమేనా? వాటి అమలు బాధ్యతను గాలికొదిలేస్తారా? అని మండిపడింది. 
 
దీంతో అప్రమత్తమైన కేంద్ర ఎన్నికల సంఘం... కఠిన చర్యలకు ఉపక్రమించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలను విధించింది. పబ్లిక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించింది.
 
500 మంది కంటే తక్కువ హాజరయ్యే సమావేశాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఇంకా రెండు విడతల పోలింగ్‌ మిగిలి ఉన్న తరుణంలో ఈసీ చర్యలు ప్రారంభించింది.
 
బెంగాల్‌లో కరోనా పరిస్థితిపై దాఖలైన పిటిషన్లపై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 
 
దీనిపై శుక్రవారం జరగబోయే విచారణలో నివేదికను సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈసీ నేడు చర్యలకు ఉపక్రమించింది. విచారణ సందర్భంగా ఈసీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారం ఉన్నప్పటికీ.. కొవిడ్‌ కట్టడికి ఈసీ తగు చర్యలు తీసుకోలేదని తెలిపింది.
 
మరోవైపు, ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన తదుపరి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వర్చువల్‌గా ప్రజల వద్దకు చేరుకుంటానని తెలిపారు. వర్చువల్‌ సమావేశాలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
 
పబ్లిక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌ షోలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. 500 కంటే తక్కువ మంది హాజరయ్యే సమావేశాలకు మాత్రమే అనుమతి నిచ్చింది. రాష్ట్రంలో ఇంకా రెండు విడతల పోలింగ్‌ మిగిలి ఉన్న తరుణంలో ఈసీ చర్యలు ప్రారంభించింది. 
 
బెంగాల్‌లో కరోనా పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని కోల్‌కతా హైకోర్టు నేడు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే ఈసీ ఈ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ప్రధాని మోదీ సైతం రేపటి సభను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
 
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుక్రవారం చేపట్టాల్సిన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, కోవిడ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష ఉండటంతో ప్రధాని మోడీ తన పర్యటను రద్దు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ కరోనాతో అతలాకుతలం: సాయం చేసేందుకు సిద్ధమన్న చైనా