భారత దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు కలకలం రేపాయి. కాశ్మీర్, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఆప్ఘానిస్థాన్- తజికిస్థాన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్‌లోని కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. అటు పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది.
పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.