Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటి అద్దెలు అడగొద్దు.. ఢిల్లీ సీఎం విజ్ఞప్తి

ఇంటి అద్దెలు అడగొద్దు.. ఢిల్లీ సీఎం విజ్ఞప్తి
, గురువారం, 26 మార్చి 2020 (07:47 IST)
కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అలాంటి వారికి కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అద్దెకు ఉంటున్న వారిని ఓనర్లు రెంట్ కోసం వేధించవద్దు అని ఆయన కోరారు.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇచ్చాయి. ఈ క్రమంలోనే యజమానులు ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని సూచించారు.

ఒకటి లేదా రెండు నెలల్లో ఇచ్చేస్తారని.. లేదా వాయిదాల రూపంలో వసూలు చేసుకుని పేదవారిని ఆదుకోవాలని కేజ్రివాల్ కోరారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు