Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి.. వెంకయ్య నాయుడు స్పష్టీకరణ

విస్తృత ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి వస్తుందేగానీ, దొడ్డిదోవన రాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మధ్య విభజన తెచ్చేందుకే బీజ

ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి.. వెంకయ్య నాయుడు స్పష్టీకరణ
, గురువారం, 27 అక్టోబరు 2016 (13:14 IST)
విస్తృత ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి వస్తుందేగానీ, దొడ్డిదోవన రాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మధ్య విభజన తెచ్చేందుకే బీజేపీ కావాలని వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 
 
ట్రిపుల్‌ తలాక్‌, ఉమ్మడి పౌరస్మృతి, రామాలయం వంటి అంశాలను యూపీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకోబోదని.. అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికల్లో ముందుకు వెళతామని ఆయన తేల్చి చెప్పారు. 'ట్రిపుల్‌ తలాక్‌ను ప్రభుత్వం మతపరమైన అంశంగా చూడట్లేదు. మేం (ప్రభుత్వం) ముస్లింల అంశాల్లో జోక్యం కల్పించుకుంటున్నామనడం తప్పు. ఇదే భారత పార్లమెంట్, ఇదే రాజకీయ వ్యవస్థ హిందూ కోడ్‌ బిల్లును, విడాకుల చట్టాన్ని తెచ్చాయి. వరకట్న దురాచారాన్ని, సతీసహగమనాన్ని ఇదే భారత పార్లమెంట్ నిషేధించింది' అని ఆయన గుర్తు చేశారు. 
 
'గతంలో సతీ సహగమనాన్ని నిషేధించినప్పుడు.. అది హిందూ ఆచారమని, ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకుంటోందని అప్పట్లో ఎవరూ చెప్పలేదే' అని వెంకయ్య ప్రశ్నించారు. వివక్షా పూరితమైన, మహిళలకు అన్యాయం చేసే ఆచారాలకు ముగింపు పలకాల్సిందేనన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకిస్తూ పలువురు ముస్లిం మహిళలు, ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతిని వెంకయ్య గుర్తుచేశారు.
 
ఇకపోతే... తాము ఉమ్మడి పౌరస్మృతి గురించి చర్చించట్లేదన్నారు. లా కమిషనే ఒక ప్రశ్నపత్రాన్ని విడుదల చేసిందని.. దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరిందని వివరించారు. నవంబరు 21లోగా ఈ అంశంపై పార్టీల అభిప్రాయాన్ని కూడా అడిగిందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వెంకయ్య వ్యక్తం చేశారు. అలాగే.. అయోధ్యలో రాముడు పుట్టినచోట అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు సం ధిత భాగస్వాములందరి మధ్యా ఒప్పందం కుదరాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిల్లరీ క్లింటన్‌పై కె ఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్.. 3నిమిషాల నిడివితో వీడియో