Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం.. కావేరి ఆస్పత్రికి నేతల క్యూ.. అన్నాడీఎంకే మంత్రులు కూడా...

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయనను చూసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చెన్నైలోని కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి క్యూ కడుతున్

మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం.. కావేరి ఆస్పత్రికి నేతల క్యూ.. అన్నాడీఎంకే మంత్రులు కూడా...
, శనివారం, 17 డిశెంబరు 2016 (16:28 IST)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయనను చూసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చెన్నైలోని కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇందులోభాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం చెన్నైకు వచ్చి కరుణానిధిని పరామర్శించి వెళ్లారు. ఆ తర్వాత కరుణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాహుల్ వెంట, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా, కరుణ కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి కన్నీరుమున్నీరు అయ్యారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కరుణ చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 'ట్రక్యోస్టమీ' అనే పరికరం సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. యాంటీబయొటిక్స్ అందిస్తున్నారు. కరుణానిధి ప్రస్తుత వయస్సు 93 ఏళ్లు. 
 
కాగా, శుక్రవారం రాత్రి కూడా ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి సూపర్ హిట్ చిత్రం బాషా చిత్రాన్ని ల్యాప్‌టాప్‌లో తిలకించినట్టు ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి మీడియాకు వెల్లడించారు. అయితే, శనివారానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి నేతలు క్యూకడుతున్నారు. అలా వెళ్లిన వారిలో లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై, తమిళనాడు మంత్రి జయకుమార్ (అన్నాడీఎంకే నేతలు) కూడా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా... ముగ్గురుని లేపేశా.... పిలిప్పీన్ అధ్యక్షుడు