Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2 వేల కోళ్లు, 300 మేకలు బలి... ఘాటు బిర్యానీ... చెన్నై షోలింగనల్లూర్ ఎమ్మెల్యే విందు భోజనం...

చెన్నైలో అంతే... చెన్నైలో అంతే... అనుకోవాల్సి వస్తుంది. ఇటీవలే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే దాదాపు అధికార పీఠానికి దగ్గరకు వచ్చి చతికిలపడింది. కానీ ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు మాత్రం అధికా

Advertiesment
DMK MLA
, మంగళవారం, 26 జులై 2016 (18:37 IST)
చెన్నైలో అంతే... చెన్నైలో అంతే... అనుకోవాల్సి వస్తుంది. ఇటీవలే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే దాదాపు అధికార పీఠానికి దగ్గరకు వచ్చి చతికిలపడింది. కానీ ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ సభ్యులపై గెలుపొందడంతో పండుగ చేసుకుంటున్నారు. దేనితో అనుకుంటున్నారు...? కోళ్లు, మేకలు బలి ఇచ్చి బిర్యానీలు వండుకు తింటున్నారు. తమిళనాడులోని షోలింగనల్లూర్ నియోజకవర్గం నుంచి డీఎంకెకు చెందిన అరవింద్ రమేష్ ఘన విజయం సాధించిన నేపథ్యంలోనూ, అలాగే ఎమ్మెల్యే కార్యాలయం పనులు పూర్తి కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం నాడు విందు ఏర్పాటు చేశారు. 
 
తనను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించాడు. అంతే... 2 వేల కోళ్లు, 300 మేకలు తెప్పించి, బలి ఇచ్చి ఆ మాంసంతో బిర్యానీ చేయించి అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఓ కళ్యాణమండపాన్ని ఆయన బుక్ చేశారు. దీనికిగాను సుమారు రూ. 2 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అన్నట్లు కార్యకర్తలు అన్నా... మాకు చుక్క పడందే ముక్క కొరకలేం అనగానే అడిగినవారికి లేదనకుండా మద్యం పార్టీ కూడా ఇచ్చారట. దటీజ్ తమిళ ఎమ్మెల్యే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు చిందులు... వాట్ ఈజ్ దిస్...?