Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహం చేసుకోనున్న రాహుల్ భార్య.. శుభాకాంక్షలు తెలిపిన భర్త.. ఎవరా రాహుల్?

Advertiesment
Dimpy Ganguly
, గురువారం, 15 అక్టోబరు 2015 (11:36 IST)
రాహుల్ భార్య మరో వివాహం చేసుకోనుంది. ఆ రాహుల్ ఎవరో తెలుసా? కేంద్ర మాజీ మంత్రి దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్. ఈయన మాజీ భార్య డింపీ గంగూలీ (30) రెండో వివాహానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. 
 
దుబాయ్ వ్యాపారవేత్త రోహిత్ రాయ్‌తో ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపింది. అంతేకాకుండా, ఎంగేజ్‌మెంట్ ఉంగరం ఫొటోను కూడా అప్‌లోడ్ చేసింది. వచ్చే నెల 27వ తేదీన కోల్‌కతాలో వీరి వివాహం జరుగనుంది. ఇరు కుటుంబాలకు చెందిన వారు, కొంత మంది సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు.
 
కాగా, రాహుల్ మహాజన్‌ను 2010లో డింపీ గంగూలీ పెళ్లాడింది. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు కలిసి 2009 నుంచి పలు రియాల్టీ షోలలో పాల్గొన్నారు. రెండేళ్లుగా రోహిత్ రాయ్‌తో డింపీ ప్రేమాయణం సాగిస్తోంది. మరో విషయం ఏమిటంటే, తన మాజీ భార్య డింపీకి రాహుల్ మహాజన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu