Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డేరా బాబా ఇల్లు ఓ ఇంద్రభవనం : గృహంలో కూడా కండోమ్స్... (Video)

అత్యాచారం కేసులో జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ ఇంటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇల్లు ఓ ఇంద్రభవనంలా ఉంది. ఈ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన పంజాబ్ పోలీసులకు క

డేరా బాబా ఇల్లు ఓ ఇంద్రభవనం : గృహంలో కూడా కండోమ్స్... (Video)
, బుధవారం, 30 ఆగస్టు 2017 (07:03 IST)
అత్యాచారం కేసులో జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ ఇంటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇల్లు ఓ ఇంద్రభవనంలా ఉంది. ఈ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన పంజాబ్ పోలీసులకు కళ్లుబైర్లు కమ్మాయి. బంగారు కుర్చీలు, బంగారు తాపడంతో చేసిన డైనింగ్ టేబుల్.. అబ్బో.. రాజసం ఉట్టిపడేలా అంలంకరణలు, పడక గదులు ఇలా ఎన్నో ఈ నివాసంలో ఇమిడివున్నాయి. ఈ గృహంలో నగలు, నగదుతో పాటు... కండోమ్స్‌ను కూడా పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు.. డేరా బాబా ప్రధాన కార్యాలయం లోపల ఉన్నవారిలో దాదాపు అందరూ బయటకు వచ్చేసినట్లే. డేరా అధినేత గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ను న్యాయస్థానం దోషిగా ప్రకటించిన తర్వాత డేరా లోపలే ఉన్న వేలాది మందిని బయటకు రప్పించడానికి యంత్రాంగం చేపట్టిన చర్యలు దాదాపు పూర్తయ్యాయి. 
 
మంగళవారం సుమారు 650 మందిని వెలుపలకు పంపించారు. ఇంకా 250-300 మంది మాత్రమే లోపల ఉన్నారని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల లోపు 18 మంది బాలికల్ని డేరా నుంచి బయటకు రప్పించారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారులపై తప్పిస్తే మిగిలిన చోట్ల బుధవారమంతా కర్ఫ్యూను ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. 
 
మంగళవారం కూడా పగటి పూట కర్ఫ్యూ సడలించారు. విద్యాసంస్థలు, బ్యాంకులు తెరచుకున్నాయి. పంజాబ్‌లో అంతర్జాల సేవల్ని పునరుద్ధరించారు. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. రైలు సేవల్ని పునరుద్ధరించారు. డేరా సంస్థ ప్రక్షాళనపై తీసుకున్న చర్యల గురించి సవివర నివేదిక సమర్పించాలని హర్యానా సర్కారును పంజాబ్‌- హర్యానా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాస్‌పోర్టు కావాలంటో కోర్కె తీర్చమన్నాడు.. ఇంటికి పిలిచి రేప్