Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంబులెన్స్‌లు డబ్బుల్లేక మొరాయించాయి: భుజాలపై మేనకోడలు శవం.. సైకిల్‌పై 10కిలోమీటర్లు?

ఉత్తర ప్రదేశ్‌లో అంబులెన్స్‌లు మొరాయించింది. డబ్బుల్లేనిదే పనిజరగదన్నాయి. ఇక చేసేది లేక చిన్నారి అయిన మేనకోడలు ప్రాణాలు కోల్పోయినా.. దుఃఖాన్ని దిగమింగుకుని.. తన భుజాలపైనే మోసుకెళ్లాడు ఓ అభాగ్యుడు. ఏడు

Advertiesment
Denied ambulance
, గురువారం, 15 జూన్ 2017 (15:35 IST)
ఉత్తర ప్రదేశ్‌లో అంబులెన్స్‌లు మొరాయించింది. డబ్బుల్లేనిదే పనిజరగదన్నాయి. ఇక చేసేది లేక చిన్నారి అయిన మేనకోడలు ప్రాణాలు కోల్పోయినా.. దుఃఖాన్ని దిగమింగుకుని.. తన భుజాలపైనే మోసుకెళ్లాడు ఓ అభాగ్యుడు. ఏడునెలల చిన్నారిని ఓ చేత్తో.. మరో చేత్తో సైకిల్ హ్యాండిల్ పట్టుకుని పది కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌ మజ్‌హన్‌పూర్లో మలాక్ సద్దీ గ్రామానికి చెందిన 7 నెలల చిన్నారి పూనమ్‌ను డయేరియాతో జిల్లా 
ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 
 
ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు సమకూర్చడానికి రోజూవారి కూలిగా పనిచేసే పూనమ్ తండ్రి అనంత్ కుమార్ అలహాబాద్ వెళ్లాడు. అదే సమయంలో చిన్నారిని చూసుకోవాల్సిందిగా బావమరిది బ్రిజ్ మోహన్‌‍కు అనంత్ చెప్పి బయలుదేరాడు. కానీ రెండు రోజుల క్రితం పూనమ్ మృతి చెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని ఆసుపత్రి వర్గాలను బతిమిలాడాడు బ్రిజ్ మోహన్.
 
వైద్యులు నిరాకరించడంతో చేసేదేమీలేక చివరకు ఓ సైకిల్‌ను అద్దెకి తీసుకొని చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లి కాన్పుకి సహకరించిన 12 ఏళ్ల బాలిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు