బ్యాంకు సిబ్బందికి ధన దాహం... 44 నకిలీ ఖాతాల సృష్టి.. రూ.100 కోట్ల బ్లాక్ మనీ డిపాజిట్
పెద్దనోట్లు రద్దు చేసి అవినీతి, నల్లడబ్బు మకిలిని వదలగొడదామని ప్రధానమంత్రి మోదీ అనుకుంటే దానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది బ్యాంకు సిబ్బంది, మరికొంతమంది పోస్టల్ అధికారులు. దేశంలో పలు బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న లావాదేవీలను చూస్తుంటే ఐటీ శాఖకు కళ్
పెద్దనోట్లు రద్దు చేసి అవినీతి, నల్లడబ్బు మకిలిని వదలగొడదామని ప్రధానమంత్రి మోదీ అనుకుంటే దానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది బ్యాంకు సిబ్బంది, మరికొంతమంది పోస్టల్ అధికారులు. దేశంలో పలు బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న లావాదేవీలను చూస్తుంటే ఐటీ శాఖకు కళ్లు బైర్లు కమ్ముతున్నంత పని అవుతోంది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీచౌక్ యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో నవంబరు 8 నుంచి ఇప్పటివరకూ ఏకంగా రూ. 450 కోట్లు డిపాజిట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ కావడంతో ఐటీ అధికారులు పోలీసులతో కలిసి ఆ బ్యాంకు లావాదేవీలను శుక్రవార నాడు తనిఖీలు చేశారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
అదేంటంటే... ఆ బ్యాంకులో 44 నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఉండటం. మరి నకిలీ ఖాతాలను తెరిచేందుకు బ్యాంకు మేనేజర్ ఎలా అనుమతించారన్నది అలా వుంచితే ఆ ఖాతాల్లో ఏకంగా రూ. 100 కోట్ల నల్లడబ్బు జమ అయినట్లు తేలింది. దీనితో వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇంకా దేశంలోని ప్రధాన నగరాల్లోని ఇతర బ్యాంకుల్లోనూ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.