Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదు.. అంతే స్నేహితుడినే చంపేశాడు..

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదు.. అంతే స్నేహితుడినే చంపేశాడు..
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:25 IST)
క్షణికావేశాలు నేరాలకు దారి తీస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల కోసం హత్యలు పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పనందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతునొక్కి హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.., దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. 
 
వాయువ్య ఢిల్లీలోని పిటాంపురా ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల మయాంక్ సింగ్, బీబీఏ చదువుతున్నాడు. ఈ సెల 21న 12వ తరగతి చదివే స్నేహితుడితో కలిసి స్థానిక పార్క్‌కు వెళ్లాడు. మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో స్నేహితుడ్ని మయాంక్ సింగ్ రాయితో కొట్టాడు. అంతటితో ఆగక క్లాత్‌తో గొంతునులిమి హత్య చేశాడు. పార్క్‌లోని ఒక చోట మృతదేహం పడేశాడు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని తన స్నేహితుల ఊరికి వెళ్లాడు.
 
మరోవైపు ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో 12వ తరగతి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 25న పార్క్‌లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. పెద్ద టెడ్డీ బేర్‌తోపాటు డ్రగ్స్ కూడా అక్కడ లభించాయి.
 
ఈ ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మయాంక్ సింగ్ తన స్నేహితుడితో కలిసి పార్క్‌కు వచ్చినట్లు గుర్తించారు. అతడి గురించి ఆరా తీయగా యూపీలోని గ్రామానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పిల్ఖువా ప్రాంతానికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారుల కోసం ఆర్గానిక్‌ కంఫర్ట్‌వేర్‌ను ఆవిష్కరించిన సూపర్‌బాటమ్స్‌