Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ పురుషుల్లో "సెక్స్" సామర్థ్యం తగ్గిపోతోందట... ఎందుకో తెలుసా? సర్వేలో వెల్లడైన నిజాలేంటి?

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీని నుంచి రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. అదేసమయంలో రోజురోజుకూ వాయు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతోం

ఢిల్లీ పురుషుల్లో
, సోమవారం, 26 డిశెంబరు 2016 (14:22 IST)
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీని నుంచి రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. అదేసమయంలో రోజురోజుకూ వాయు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఢిల్లీ నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. 
 
దీనికితోడు వాయు, ధ్వని, వాహన కాలుష్యాల వల్ల ప్రజలకు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. కళ్ళ మంటలతో అవస్థలు పడుతున్నారు. కొందరికి గుండె జబ్బులు వస్తున్నాయి. ఇదే అంశంపై దాల్మియా మెడికేర్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మగవారిని దిగ్భ్రాంతికి గురిచేసే నిజం ఒకటి తెలిసింది. 
 
ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మగవారి జుట్టు రాలిపోతోందని, స్పెర్మ్‌కౌంట్, లైంగిక సామర్థ్యం తగ్గిపోతున్నాయని వెల్లడైంది. ఈ యేడాది జనవరిలో వీరి స్పెర్మ్ కౌంట్ తగ్గింపు 14 శాతం ఉండగా.. నవంబర్ నాటికి అది 27 శాతానికి పెరిగిపోయిందట. 30-40 ఏళ్ళ మధ్య వయసున్న మగాళ్ళలో ఇది మిల్లీ లీటర్‌కు 10 మిలియన్ల కన్నా తక్కువేనని తెలిసింది. నేషనల్ ఏవరేజ్ ప్రకారం ఇది 20 మిలియన్లు ఉండాలట. 
 
ఇక ఈ కాలుష్యం కాటు వల్ల మహిళల్లో కూడా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని, వారు వివిధ శారీరక రుగ్మతలకు గురవుతున్నారని వెల్లడైంది. ఇలాంటి కాలుష్యాన్ని ఎన్నడూ చూడలేదని, సదా ముఖాలకు మాస్క్ లాంటిది ధరించి వెళ్ళాల్సి వస్తోందని అంటున్నారు. సిటీలో వాహనాలు పెరిగిపోవడం కూడా పరిస్థితికి ఆజ్యం పోస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు ప్రాణాలు తీసిన మాదక ద్రవ్యాల మత్తు... పెన్సిల్వేనియాలో విషాదం