కరోనా నియంత్రణ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ విధించడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోతుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పెట్టినప్పటికి ఆదాయం వచ్చే మార్గాల కోసం ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి.
చాలా రాష్ట్రాలకు మద్యం అమ్మకమే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వగా.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చిన వారికి హోం డెలివరీ చేసుందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ, విదేశీ మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ చట్టాలను సవరించారు. అయితే.. హాస్టళ్లకు, ఆఫీసులకు మాత్రం మద్యం హోం డెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు.
కానీ ఖచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదు అని ఢిల్లీ అబ్కారీ శాఖ ఓ ప్రకనటలో తెలిపింది.