Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తమామల నగ్న వీడియోలు తీసిన కోడలు.. ప్రియుడి సహకారం!

video
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (08:13 IST)
ఢిల్లీలో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన అత్తామామలు సన్నిహితంగా ఉన్న సమయంలో వారి నగ్న వీడియోను ఆ ఇంటి కోడలు తీసారు. ఇందుకు ఆమె ప్రియుడు కూడా తన వంతు సహకారం అందించారు. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి (ఆభరణాల వ్యాపారి), తన భార్యకు నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. 
 
బండారం బయటపడటంతో ఇంట్లో ఉన్న రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. 
 
తమ ఇంట్లో అత్తమామల (భర్త తల్లిదండ్రులు) గదిలో రహస్య కెమెరాలు పెట్టి.. వారి నగ్న వీడియోలు తీసిన విషయాన్ని బయటపెట్టింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌పుట్‌ వ్యయం పెరగడంతో ఏ2 గేదె పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌