Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై మూసివుంచిన రైస్ మిల్లులో రేప్ చేసిన యువకుడికి జైలు శిక్ష

బాలికలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. ఆధునికత పేరుతో రోజులు మారాయి. వయోభేదంలేకుండా మనుషుల్లో రాక్షసత్వం మేల్కొంటోంది.

Advertiesment
బాలికపై మూసివుంచిన రైస్ మిల్లులో రేప్ చేసిన యువకుడికి జైలు శిక్ష
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (09:41 IST)
బాలికలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. ఆధునికత పేరుతో రోజులు మారాయి. వయోభేదంలేకుండా మనుషుల్లో రాక్షసత్వం మేల్కొంటోంది. ఆసమయంలో ఆడపిల్లలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఊహతెలియని వయసులో ఉన్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 
 
అలా అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడిన ఓ యువకుడికి కోర్టు మరణశిక్ష విధించింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బిర్భుం జిల్లాలోని మోల్డంగ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై గిరిజన యువకుడు సుకల్ టుడు (20) అనే వ్యక్తి పది నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు అతనిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 
 
గతేడాది 11వ తేదీన బాలిక అదృశ్యమైన బాలికను కిడ్నాప్ చేసి... తలుపులు వేసిన రైసు మిల్లులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ముందు అంగీకరించాడు. అయితే బాలిక మాత్రం ఆస్పత్రిలో చికిత్స ఫలించక మరణించింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణశిక్ష విధించడం పట్ల బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సామాజిక వేత్తలు, స్థానికులు, ప్రజలు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీమ్ కేసులో ఆ ముగ్గురి తెరాస నేతల పేర్లు... ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారట..