Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సాప్ మోసం.. రూ.36,900 చెల్లించాడు.. తీరా చూస్తే..?

టెక్నాలజీ ప్రభావం.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని రోజు రోజుకీ ఆన్‌లైన్ మోసాలు పెరుగుతూనే వున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త కథ చెప్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌,

వాట్సాప్ మోసం.. రూ.36,900 చెల్లించాడు.. తీరా చూస్తే..?
, శనివారం, 18 ఆగస్టు 2018 (10:09 IST)
టెక్నాలజీ ప్రభావం.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని రోజు రోజుకీ ఆన్‌లైన్ మోసాలు పెరుగుతూనే వున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త కథ చెప్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌‌లతో అమాయకులు మోసపోతున్నారు. ఇటీవల ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. 
 
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్య పరిచయం బాగానే ముదిరింది. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. ఇద్దరూ వాట్సప్‌లో చాటింగ్‌ చేసుకోవడం ప్రారంభించారు. కొద్దిరోజులకే ఆ వ్యక్తి  తన ఇంటి అడ్రస్‌ను విదేశీ యువతికి వెల్లడించారు.
 
ఈ క్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ పంపిస్తున్నా.. తీసుకోవాల్సిందిగా చాటింగ్ చేసింది. అందులో ఆపిల్‌ఫోన్, బంగారుగొలుసు, ల్యాప్‌టాప్, షూ, గడియారం తదితర వస్తువులు సుమారు 50,000 వేల బ్రిటీష్‌ఫౌండ్లు పంపిస్తున్నట్లు ఫోటోలు తీసి.. కొరియర్‌రశీదు వాట్సప్‌ చేసింది. ఈనెల 13న స్వైప్‌ ఎక్ర్‌ప్రెస్‌ కొరియర్‌ పేరుతో ఓ పార్సిల్‌ వచ్చినట్లు ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది. 
 
అంతే ఆ వ్యక్తి ఎగిరి గంతేసి ఢిల్లీ చేరుకున్నాడు. సదరు పార్సిల్ కార్యాలయంలో విచారించగా రూ.36,900 చెల్లించి తీసుకెళ్లామన్నారు. దాంతో అతను అంత మొత్తం చెల్లించి పార్సిల్ తెచ్చుకున్నాడు.. తీరా చూస్తే అందులో యువతి చెప్పిన వస్తువులేవి లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే సదరు యువతి వాట్సప్‌ నంబర్‌ బ్లాక్‌చేసి, ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్‌ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరదల్లో నిండు గర్భిణిని ఆసుపత్రికి... నేవీ ఆసుపత్రిలో మగబిడ్డ